హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కలిశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల19న గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్న మ్యూజిక్ కాన్సర్ట్‌కు రేవంత్, భట్టివిక్రమార్కను దేవిశ్రీ ప్రసాద్ ఆహ్వానించారు. ఆయన వెంట నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు.